Tuesday, November 16, 2021

తెలుగు వాళ్ళ హిందీ కష్టాలు

"దేశ భాషలందు తెలుగు లెస్స" అన్నారు రాయల వారు. ఈ విషయం తెలుగు రాష్ట్రం లోనే చెప్పినట్లు న్నారు. అందుకే హిందీ కి ఉన్న గుర్తింపు తెలుగుకి లేదు. మిగతా రాష్ట్రాలలో హిందీ దే పై చెయ్యి. ఒక హిందీ రాని తెలుగు వ్యక్తి వేరే రాష్ట్రం వెళితే అక్కడ ఎదురయ్య కొన్ని కష్టాలు:
1.  వాహన చోదకులు(car/auto drivers) 
అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. వాళ్లకి మనకీ ఒకటే పోలిక. వాళ్ళకి ఇంగ్లీషు, మనకి హిందీ  అంతంత మాత్రంగానే వచ్చు. పోనీ ఏదో మనకి వచ్చిన హిందీ ఇంగ్లీష్ మిక్సి లో వేసి అడ్రస్ చెప్తే "నాయే ఆయీ? హిందీ నహీ జాంతీ?" అంటూ మనల్ని అవమానం చేసేస్తాడు. 
పైగా కొందరయితే హిందీ రాదురా మహానుభావా అంటే క్యాబ్ ఎక్కిన దగ్గర నుండి లోడ లోడా వాగుతూనే ఉంటారు. ఆ ఊరి గొప్పతనం, దాని పూర్వాపరాలు ఇంకా ఏదేదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.  మనం తెల్ల మొహం వేస్కుని తల ఊపడమే!!

hindi1


2. నేస్తులు (collegues)
ఇక్కడ ఇంకో దారి ఉంది. ఇంగ్లీష్ లో మాట్లాడవచ్చు. కానీ ఈ హిందీ వాళ్ళు ఉన్నారే! వీళ్ల దుంపలు తెగ, హిందీ లోనే మాట్లాడతారు. ఇంగ్లీషు లో మొదలెట్టినా హిందీ లో కి జంప్ చేస్తారు.ఏదో నలుగురితో మాట్లాడదాం అనుకుంటే వీళ్లేమో ఇలా ఏడిపించేస్తారు.

hindi2


3. పనిమనుషులు(Helpers)
వీళ్ళ తో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే వీళ్ళు ఒక్కోసారి గ్రాంథిక హిందీ లోకి వెళ్ళారంటే ఆ సునామీ ని తట్టుకోవడం మన వల్ల కాదు. తిడుతున్నారో, పొగుడుతూ ఉన్నారో తెలియదు.


hindi3


4. సినిమాలు
కొన్ని హిందీ  సినిమాలు ఉంటాయి, ఎక్కడ మనలాంటి వాళ్ళకి అర్థం ఐపోతుందో అని తీసినట్టు ఉంటాయి. డైలాగులు అర్థం కావు,పాటలు అర్థం కావు, ఏదో కష్టపడి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తో సినిమా అర్థం చేసుకుందాం అంకుంటాం! మన పక్కన వాళ్ళు ఊరుకొనిస్తేనా? మధ్యలో జోకులకి నవ్వుతూ ఉంటారు. సెంటిమెంట్ సీన్లు వస్తే ఏడుస్తారు. గీత లో చెప్పినట్టు మనం నవ్వుకి ఏడుపుకి అతీతంగా సినిమా చూస్తాం.
hindi4



5. స్నేహితులు
కొన్ని బలీయమైన పరిస్థితులలో మన స్నేహితుల కుటుంబం ని కలవాల్సి వస్తుంది.
 ఇది నరకం!! ఒక్క హిందీ నే తట్టుకోలేం అనుకుంటే, అక్కడ కుటుంబం కుటుంబం అంతా హిందీ ఏ. ఆ ఇంటి వాళ్ళు చాలా ప్రేమ తో మాట్లాడతారు,కానీ మనకి అర్థం కావాలి కదా! పక్కన ఎవరైనా హిందీ తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్ళాలి తప్ప ఒక్కళ్ళు వెళ్ళమా. ఇక అంతే సంగతులు!!
hindi5


ఇంకా కూరలు అమ్మే వాడు దగ్గర నుండి  కస్టమర్ కేర్  దాకా అందరూ మనకి హిందీ రాదని గుర్తుచేసే వాళ్ళే. అయినా తెలుగు వాళ్ళం తలచుకుంటే హిందీ నేర్చుకో లేమా చెప్పండి? అవసరం అయితే వాళ్ళకే తెలుగు నేర్పించే ద్దాం!!!


Gif Source: Google

My other posts